బాక్సుల కొద్దీ యాపిళ్లను కాలువలో పారబోసిన రైతు.. కారణమిదే! - వైరల్ వీడియోలు
🎬 Watch Now: Feature Video
Himachal Gardeners Threw Apples Into Drain : హిమాచల్‌ప్రదేశ్‌లోని శిమ్లా జిల్లాకు చెందిన ఓ రైతు.. బాక్సుల కొద్దీ యాపిళ్లను కాలువలో పారబోశాడు. ఓ వాహనంలో యాపిళ్ల బాక్సులను తీసుకువచ్చి.. నీటిలో పడేశాడు. రామ్‌పుర్ పరిధిలోని బలసన్ అనే గ్రామానికి చెందిన రైతు.. స్థానికంగా పారుతున్న చిన్న కాలువలో ఇలా యాపిళ్లను పారబోశాడు. గత కొద్ది రోజులుగా హిమాచల్ ప్రదేశ్‌లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చాలా మటుకు రోడ్లన్ని దెబ్బతిన్నాయి. కొండచరియలు కూలి రోడ్లపై పడ్డాయి. తద్వారా రాకపోకలకు తీవ్ర అంతరాయం వాటిల్లింది. కారణంగా సకాలంలో మార్కెట్‌కు యాపిళ్లను తీసుకెళ్లలేక పోవడం వల్ల అవి కుళ్లిపోయాయి. దీంతో వాటిని ఆ రైతు కాలువలో పారబోశాడు.
ప్రస్తుతం ఈ అంశం హిమాచల్ ప్రదేశ్‌లో రాజకీయ రగడకు దారితీసింది. యాపిల్ రైతులకు సరైన సదుపాయలు కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అలాంటి దేమిలేదని అధికార పార్టీ నేతలు కొట్టిపారేస్తున్నారు. కాగా వీలైనంత త్వరగా రోడ్ల పనరుద్దణను పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. రైతులు సమస్యలు తీరుస్తామని తెలిపారు.