మెరిట్ విద్యార్థులకు హెలికాప్టర్ రైడ్.. టాపర్లకు రూ. 1.5 లక్షల రివార్డు - ఛత్తీస్‌గఢ్ టెన్త్ టాపర్లకు హెలికాప్టర్ రైడ్
🎬 Watch Now: Feature Video

10, 12 తరగతుల్లో మెరిట్ సాధించిన 78 మంది విద్యార్థులను ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం హెలికాప్టర్లో తిప్పింది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ప్రేమ్‌సాయి సింగ్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఎనిమిది మంది పిల్లలను ఒక గ్రూపుగా విభజించి హెలికాప్టర్లో తిప్పారు. రైడ్ ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి భూపేశ్ బగేల్.. విద్యార్థులకు స్వామి ఆత్మానంద్ మేధావి ఛత్ర ప్రోత్సాహన్ యోజన కింద మెరిట్ సర్టిఫికెట్లు అందించారు. ప్రతిభా సమ్మాన్ పేరిట నిర్వహించిన ఈ వేడుకలో సీఎం.. విద్యార్థులకు రూ. 1.5లక్షలు ప్రోత్సాహకం అందించారు. మెరిట్ లిస్ట్‌లో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థులను గోల్డ్ మెడల్, ద్వితీయ స్థానంలో నిలిచిన విద్యార్థులను సిల్వర్ మెడల్‌తో సత్కరించారు.
కాగా రాష్ట్రవ్యాప్తంగా ఈ సంవత్సరం వెలువడిన 10 తరగతి ఫలితాల్లో 48 మంది విద్యార్థులు, 12 తరగతి ఫలితాల్లో 30 మంది విద్యార్థులు మెరిట్ సాధించారు. వీరితో పాటు 10, 12 తరగతుల్లోని ప్రతిభావంతులైన గిరిజన విద్యార్థులకు 'హెలికాప్టర్ రైడ్' కల్పించి సర్టిఫికెట్లు అందజేశారు. తమ పిల్లలు పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించినందుకు వారి తల్లిదండ్రులు సైతం సంతోషిస్తున్నారు. 'హెలికాప్టర్ రైడ్' కార్యక్రమాన్ని నిర్వహించినందుకుగాను రాష్ట్ర ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. అయితే గతేడాది కూడా రాష్ట్ర ప్రభుత్వం 125 మంది మెరిట్ విద్యార్థులకు హెలికాప్టర్ రైడ్ కల్పించింది.