Subsidy Tomatoes in AP అక్కడ టమాట కిలో రూ.50 లే..! రైతు బజారుకు క్యూ కట్టిన జనాలు..!

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 2, 2023, 1:26 PM IST

Updated : Aug 2, 2023, 1:57 PM IST

Queue Lines For Subsidy Tomatoes: కొండెక్కిన టమాట ధరలతో జనం చుక్కలు చూస్తున్నారు. రోజురోజుకు పెరుగుతున్న ధరలతో టమాటలు కొనాలంటే జంకుతున్నారు. కొన్నిచోట్ల సబ్సిడీకి టమాటాలు అందిస్తున్న నేపథ్యంలో చాలా మంది తెల్లవారుజాము నుంచే లైన్​లలో వేచి చూస్తున్నారు. తాజాగా గుంటూరు రైతు బజారు వద్ద ఉదయం ఆరు గంటల నుంచి.. ప్రజలు కిలోమీటరు మేర బారులు తీరారు. బయట మార్కెట్లో కిలో టమాట ధర 200 నుంచి 250 రూపాయలు పలుకుతుంది. దీంతో జనమంతా సబ్సిడీ మీద ఇచ్చే టమాటాల కోసం రైతు బజారుకు తరలివచ్చారు. వారం రోజులుగా రైతు బజారులోనూ టమాటలు లేకపోవడంతో.. ఒక్కసారిగా స్థానికులు టమాటల కోసం ఎగబడ్డారు. రైతు బజారు దాటి రహదారిపైనా అర కిలోమీటర్లు మేర టమాటల కోసం నిలబడ్డారు. ప్రతిరోజు సబ్సిడీ మీద 50 రూపాయలకే టమాటాలు ఇస్తే ఇంతగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదని ప్రజలు వాపోతున్నారు. ఇతర రైతు బజారుల్లోనూ టమాటలు అందుబాటులో ఉంచాలని, ధరలు దిగివచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని గుంటూరు వాసులు కోరుతున్నారు.

Last Updated : Aug 2, 2023, 1:57 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.