మారువేషంలో సీఎం- ముఖానికి మాస్క్, తలకు టోపీ- సెక్యూరిటీ లేకుండా ప్రజల మధ్యే

By ETV Bharat Telugu Team

Published : Nov 9, 2023, 8:23 AM IST

Updated : Nov 9, 2023, 10:34 AM IST

thumbnail

Haryana CM Viral Video : సాధారణ పౌరుడిలా జనాల మధ్య హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సరదాగా గడిపారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. ఎవరూ గుర్తుపట్టకుండా ముఖానికి మాస్క్, తలకు టోపీ పెట్టుకుని ప్రజల మధ్య సీఎం మనోహర్​ లాల్ ఖట్టర్​ తిరిగారు. ఈ వీడియో చూసిన వారు ఆశ్చర్యపోతున్నారు.

పంచ్​కులాలోని సెక్టార్​-5లోని ఓ గ్రౌండ్​లో జరుగుతున్న మేళాకు మంగళవారం సాయంత్రం సీఎం ఖట్టర్ మారువేషంలో సామాన్య వ్యక్తిలా వచ్చారు. ఈ మేళాకు లక్షలమంది వస్తారు. ఈ మేళాలోనే.. ముఖ్యమంత్రి ఎటువంటి సెక్యూరిటీ లేకుండా కాసేపు ప్రజల మధ్య తిరిగారు. ఎవరూ గుర్తుపట్టకుండా మాస్క్ పెట్టుకుని, తలకు టోపీ ధరించి, తువ్వాలు చుట్టుకుని ఆ మేళాలో అటూ ఇటూ తిరిగారు. ఆ ప్రదేశంలో కొంచెం సేపు ఫోన్​ చూసుకుంటూ నిలబడ్డారు. అనంతరం సీఎం ఖట్టర్.. ఓ స్టాల్​లో పాప్​కార్న్ కొనుగోలు చేసి ఆ ప్రాంతమంతా తిరిగారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. 

Last Updated : Nov 9, 2023, 10:34 AM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.