Harish Rao on Haritha Haram : 'దేశంలోనే 7.4 శాతం గ్రీన్ కవర్ పెంచిన ఏకైక రాష్ట్రం.. మన తెలంగాణ' - ప్రజల ఆరోగ్య రక్షణ కోసం హరితహారం

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 30, 2023, 11:48 AM IST

Harish Rao on Telangana Harithaharam : ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో ప్రజల ఆరోగ్య రక్షణ కోసం హరితహారం చేపట్టడం జరిగిందని మంత్రి హరీశ్​రావు అన్నారు. దేశంలోనే 7.4 శాతం గ్రీన్ కవర్ పెంచిన ఏకైక రాష్ట్రం.. తెలంగాణ రాష్ట్రమని మంత్రి పేర్కొన్నారు. సిద్దిపేటలో 20 వేల మొక్కలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. హరితహారంలో భాగంగా సిద్దిపేట మున్సిపల్ కార్యాలయం వద్ద ఇంటింటికీ 5 మొక్కల పంపిణీ కార్యక్రమంలో మంత్రి హరీశ్​రావు పాల్గొని మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిద్దిపేటను ఆకుపచ్చ, హరిత సిద్దిపేటగా మార్చుకున్నామని మంత్రి తెలిపారు. సిద్దిపేటలో ఉచితంగా నచ్చిన పండ్ల మొక్కలను ఇంటింటికీ అందజేస్తామని చెప్పారు. సీఎం కేసీఆర్ దూరదృష్టి వల్ల ఈ కార్యక్రమం సాధ్యమైందని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 14,864 నర్సరీలు, 19,072 పల్లె ప్రకృతి వనాలు అభివృద్ధి చేశామని వెల్లడించారు. 13.44 లక్షల ఎకరాల్లో రాష్ట్రవ్యాప్తంగా 273 కోట్ల మొక్కలు నాటించామని మంత్రి హరీశ్​రావు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వంటి నిజమైన పర్యావరణవేత్తకు మాత్రమే ఇది సాధ్యమవుతుందని కొనియాడారు. నేడు తెలంగాణ ఏం చేస్తుందో.. దేశం అదే అనుసరిస్తోందని పునరుద్ఘాటించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.