కదులుతున్న బస్సులో మంటలు, ఇద్దరు మృతి- గ్యాస్ సిలిండర్ వల్లే! - గురుగ్రామ్‌లో బస్సులో చెలరేగిన మంటలు
🎬 Watch Now: Feature Video
Published : Nov 9, 2023, 11:07 AM IST
Gurugram Bus Fire Accident : కదులుతున్న ఓ స్లీపర్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడం వల్ల ఇద్దురు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటన హరియాణాలోని గురుగ్రామ్‌లో జరిగింది.
ఓల్వో స్లీపర్ బస్సులో సుమారు 35 నుంచి 40 మంది ప్రయాణికులు దిల్లీ నుంచి జైపుర్‌కు వెళ్తున్నారు. బస్సు గురుగ్రామ్ దగ్గరకు రాగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చే లోపే బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు. పది మంది వరకు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. "ప్రయాణికుల దగ్గర చిన్న గ్యాస్ సిలిండర్ ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఆ సిలిండర్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చు. దీనిపై ఫోరెన్స్ బృందం దర్యాప్తు చేస్తోంది. అయితే ఈ ఘటన అనంతరం బస్సు డైవర్ పరారయ్యాడు. అతనిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాం" అని గురుగ్రామ్ పోలీస్ కమిషనర్ వికాస్ కుమార్ అరోడా తెలిపారు.