ఏనుగుపై డ్యాన్స్ చేస్తూ బరాత్.. రోడ్డుపై డబ్బుల వర్షం కురిపించిన వరుడు - పెళ్లి ఊరేగింపులో నృత్యాలు చేసిన వరుడు
🎬 Watch Now: Feature Video
ప్రస్తుతం కాలంలో ప్రజలు తమ పెళ్లిళ్లు గుర్తుండిపోయేలే జరుపుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. దీనిలో భాగంగా రకరకాలుగా బరాత్ వేడుకలు జరుపుకుంటున్నారు. అయితే గుజరాత్‌లోని భావ్‌నగర్‌కు చెందిన ఓ వరుడు ఏనుగుపై ఊరేగుతూ తన బరాత్ వేడుకలు జరుపుకున్నాడు. భావ్‌నగర్ జిల్లాకు చెందిన రమేశ్ భగవాన్భాయ్ హౌలియా కుమారుడు కుల్దీప్కు.. గర్దా ప్రాంతానికి చెందిన వైశాలి అనే యువతికి ఫిబ్రవరి 23న వివాహం జరిగింది. అయితే ఈ వివాహ వేడుకల్లోని ఊరేగింపులో భాగంగా కుల్దీప్ ఏనుగుపైకి ఎక్కి.. కత్తిపట్టుకుని మరీ చిందులేశాడు. దీన్ని చూసేందుకు గర్దా వాసులు రోడ్లపైకి ఎగబడ్డారు. కుల్దీప్ ఏనుగుపై ఉంటూ డబ్బు కట్టలను కిందకు విసిరాడు. ఈ ఊరేగింపులో రకరకాల లగ్జరీ కార్లు ఏనుగును అనుసరించాయి. ఈ కార్లపైకి ఎక్కి అతడి బంధువులు కూడా నోట్ల కట్టలను కిందకు విసిరారు. దీంతో దాదాపు ఓ కిలోమీటరు మేర ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడినట్లు స్థానికులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో స్థానికంగా వైరల్‌గా మారింది.