112 కేజీలతో ప్రపంచంలోనే అతిపెద్ద 'గోల్డెన్ బర్గర్'- ఏం చేశారో తెలుసా? - గోల్డెన్ బర్గర్ ఆగ్రా
🎬 Watch Now: Feature Video
Published : Nov 3, 2023, 9:59 AM IST
|Updated : Nov 3, 2023, 11:36 AM IST
Golden Burger Agra : ఉత్తర్‌ప్రదేశ్ ఆగ్రాలోని ఓ 5 స్టార్ హోటల్.. 112 కేజీల భారీ బంగారు బర్గర్‌ను తయారు చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రేరణతో.. తృణధాన్యాలను ఉపయోగించి ఈ బర్గర్‌ను తయారుచేశారు. దానిపై నుంచి గోల్డెన్ పేపర్‌తో కోటింగ్ వేశారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గోల్డెన్ బర్గర్‌గా భావిస్తున్నారు. జొన్నలు, రాగులు, కీరదోస, టమాట తదితర పదార్థాలతో ఈ బర్గర్‌ను తయారు చేశారు. బర్గర్ చాచూగా ప్రాచుర్యం చెందిన పంజాబ్‌కు చెందిన షెఫ్ శరన్‌దీప్ సింగ్‌ను.. గోల్డెన్ బర్గర్ తయారీ కోసం ఆగ్రాకు పిలిపించింది హోటల్ మేనేజ్మెంట్. స్టార్ హోటల్ షెఫ్‌లతో కలిసి ఆయన ఈ గోల్డెన్ బర్గర్ తయారు చేశారు.
ఫాస్ట్ ఫుడ్ ఆరోగ్యానికి మంచిది కాదని, బర్గర్ కూడా అందులో ఒకటని హోటల్ జనరల్ మేనేజర్ వివేక్ మహాజన్ చెప్పుకొచ్చారు. ఆరోగ్యానికి ఎలాంటి చెడు చేయని బర్గర్‌ను ఇప్పుడు తాము తయారు చేశామని తెలిపారు. చాలా వరకు తృణధాన్యాలే వాడినట్లు చెప్పారు. 'దేశప్రజలు మిల్లెట్లు తినాలని ప్రధాని నరేంద్ర మోదీ చెబుతూ ఉంటారు. ఇది ఆరోగ్యానికి మంచిది. రైతులకు కూడా ప్రయోజనకరం. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ ప్రత్యేక బర్గర్‌ను తయారు చేశాం' అని వివేక్ వివరించారు. ప్రజలకు తృణధాన్యాల మీద అవగాహన కోసమే ఈ బర్గర్‌ను సిద్ధం చేసినట్లు చెప్పారు. ఈ బర్గర్‌ను 250 మంది పాఠశాల పిల్లలకు పంచినట్లు వివేక్ తెలిపారు.
ఆ రెస్టారెంట్లో 'కరోనా బర్గర్'కు భలే గిరాకీ
40 కేజీల బాహుబలి బర్గర్ ఎన్ని కిలోల సాస్ వాడారో తెలుసా
పిల్లల్లో పౌష్టికాహార లోపం నివారించేందుకు మిల్లెట్ ఫుడ్ ఫెస్టివల్