యువకుడిని రోడ్డుపై పరిగెత్తించుకుంటూ కొట్టిన యువతులు.. ఆ కామెంట్ చేశాడని.. - పరిగెత్తించుకుంటూ కొట్టిన యువకులు వైరల్ వీడియో
🎬 Watch Now: Feature Video
ఉత్తరాఖండ్ హరిద్వార్ జిల్లాలో ఓ పోకిరికి గట్టిగా బుద్ధి చెప్పారు ఇద్దరు యువతులు. రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తుండగా కామెంట్ చేసిన యువకుడిని కర్రతో కొట్టి ఆగ్రహం తీర్చుకున్నారు. రూడ్కీలోని సివిల్ లైన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సోమవారం ఈ ఘటన జరిగింది. ఇద్దరు యువతులు నీలం టాకీస్ సమీపంలో నడుచుకుంటూ వెళ్తుండగా.. ఓ వ్యక్తి వారిని ఫాలో అయ్యాడు. యువతుల గురించి అసభ్యంగా మాట్లాడుతూ వెంబడించాడు. దీంతో యువతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడిని అడ్డుకున్నారు. ఓ యువతి అతడిని గట్టిగా పట్టుకోగా.. మరో యువతి పక్కనే ఉన్న కర్రతో దాడి చేసింది. కర్రతో కొడుతున్న దృశ్యాలను రోడ్డుపై వెళ్తున్న వ్యక్తులు రికార్డు చేశారు. అయితే, యువతులు కొడుతుండగా.. నిందితుడు తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. వారి నుంచి దూరంగా పారిపోయాడు. అయితే, యువతులు మాత్రం వెనక్కి తగ్గలేదు. అతడిని వెంబడించారు. రోడ్డుపైనే ఈ ఘటన జరగడం వల్ల ట్రాఫిక్కు కాస్త అంతరాయం ఏర్పడింది. అటుగా వెళ్తున్న వారు తమ వాహనాలను ఆపేసి.. ఆ ఘటనను చూస్తూ ఉండిపోయారు. కొందరు మాత్రం.. 'ఏం జరిగింది?' అంటూ ఆరా తీశారు. అయితే, ఈ ఘటన తమ దృష్టికి రాలేదని పోలీసులు చెబుతున్నారు. వైరల్ అవుతున్న వీడియోను చూసి తదుపరి చర్యలు తీసుకుంటామని అంటున్నారు.