హంసనడకలతో ఆకట్టుకున్న అతివలు.. చీరకట్టులో ర్యాంప్‌పై అదరహో - చీరకట్టులో అదరహో అనిపించిన అతివలు
🎬 Watch Now: Feature Video

Impressive Fashion Show In Hyderabad: హైదరాబాద్ నగరంలో అందమైన అమ్మాయిలు తమ హంసనడకలతో ఆకట్టుకున్నారు. సంప్రదాయ చీరకట్టులో మహిళలు ర్యాంప్‌పై అడుగులు వేస్తూ అదరహో అనిపించారు. ఫెస్టివల్ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని.. ఓ సంస్థ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నగరంలో వస్త్రాభరణాల ప్రదర్శన నిర్వహించనుంది. దీనికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నగరంలోని ఓ హోటల్‌లో ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా.. నగరానికి చెందిన పలువురు మోడల్స్ ఈ కార్యక్రమంలో పాల్గొని గోడ పత్రికను విడుదల చేసి, సందడి చేశారు. ఈ మేరకు ప్రత్యేకంగా నిర్వహించిన ఫ్యాషన్ షో ఆద్యంతం అందరినీ ఆకట్టుకుంది. దేశవ్యాప్తంగా పేరొందిన దాదాపు 100 మందికి పైగా డిజైనర్లు రూపొందించిన సరికొత్త డిజైన్ వేర్ ఉత్పత్తులను అందుబాటులో ఉంచనున్నట్లు నిర్వహకులు తెలిపారు. ఈ నెల 18వ తేదీ నుంచి 20 వరకు 'స్ప్రింగ్ సమ్మర్ ఎడిషన్' పేరుతో బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణ హోటల్‌లో ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నట్లు వారు తెలిపారు.