మెట్రో ట్రాక్​పై యువతి ఆత్మహత్యాయత్నం- వైరల్ వీడియో వెనుక కథ ఇదీ! - మెట్రో స్టేషన్​లో ఆత్మహత్యాయత్నం చేసిన యువతి

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telugu Team

Published : Dec 12, 2023, 3:47 PM IST

Girl Tries To Jump From Metro Pillar : మెట్రో ట్రాక్​పై నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ఓ యువతి యత్నించిన ఘటన దిల్లీలో జరిగింది. దీనిపై సమాచారం అందుకున్న మెట్రో, పోలీసు సిబ్బంది ఆమె ప్రాణాలు కాపాడారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. 

ఇంతకీ ఏం జరిగిందంటే? 
'దిల్లీలోని ఓ కళాశాల విద్యార్థిని ఏదో విషయంలో తన తల్లిదండ్రులతో వాగ్వాదానికి దిగింది. దీంతో ఆ యువతి డిసెంబర్ 11 సాయంత్రం సమయంలో షాదీపుర్ మెట్రో స్టేషన్​కు వెళ్లింది. ఎలివేటెడ్ మెట్రో ట్రాక్​పై మొబైల్​ ఫోన్లో మాట్లాడుతూ నడుచుకుంటూ వెళ్లి ఆత్మహత్యాయత్నానికి యత్నించింది. ఈ క్రమంలోనే రహదారిపై ఉన్న కొంతమంది ఆమెను వెనక్కి వెళ్లమని కోరారు. ఇంతలో అక్కడకు చేరుకున్న భద్రతా సిబ్బంది ఆ యువతిని రక్షించారు' అని సంబంధిత అధికారి ఒకరు వెల్లడించారు. అనంతరం ఆ యువతికి కౌన్సెలింగ్ నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగించినట్లుగా పోలీసులు తెలిపారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.