100 అడుగుల ఎత్తైన జలపాతంపై నుంచి యువతి జంప్.. దృశ్యాలు వైరల్ - 100 అడుగుల ఎత్తు నుంచి దూకిన బాలిక
🎬 Watch Now: Feature Video
Girl Jumped Chitrakot Waterfall: 100 అడుగుల ఎత్తైన జలపాతంపై నుంచి ఓ యువతి దూకిన సంఘటన ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పుర్ జిల్లాలో జరిగింది. ఇంద్రావతి నదిపై ఉన్న చిత్రకోట్ జలపాతంపైకి శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు చేరుకున్న గుర్తు తెలియని యువతి అక్కడి నుంచి కిందకు దూకింది. నీటి ప్రవాహంలో గల్లంతైంది. సమాచారం అందుకున్న వెంటనే.. రెండు బృందాలు ఆమె కోసం గాలింపు చేపట్టాయని అధికారులు తెలిపారు. కొన్ని గంటలపాటు వెతికినా ఆచూకీ లభించలేదని చెప్పారు. యువతి దూకుతున్న సమయంలో కొందరు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయగా.. ఆ దృశ్యాలు వైరల్‌గా మారాయి. కాసేపు జలపాతం చివరి కొనకు నిలబడిందని.. ఆపేందుకు యత్నించినా ఫలితం లేకపోయిందని స్థానికులు తెలిపారు.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST