Four Poisonous Snakes Viral Video : ఒకేరోజు 4 పాములు కలకలం.. స్కూటీల్లో మూడు.. మెకానిక్ షెడ్లో ఇంకొకటి.. - వైరల్ వీడియో పాములు నాగు
🎬 Watch Now: Feature Video
Published : Sep 12, 2023, 8:09 PM IST
Four Poisonous Snakes Viral Video : ఒకే రోజు నాలుగు వేర్వేరు చోట్ల.. పాములు కలకలం సృష్టించాయి. స్థానికులను భయభ్రాంతులకు గురిచేశాయి. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు.. వాటిని రక్షించి అడవిలోకి విడిచిపెట్టారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని రిషికేశ్ జిల్లాలో ఈ ఘటనలు జరిగాయి.
- జిల్లాలోని శ్యాంపుర్ గ్రామంలో ఓ ఇంటి వద్ద ఆగి ఉన్న స్కూటీలో నాగుపాము చొరబడింది. బయటకువెళ్లేందుకు వాహనదారుడు.. స్కూటీ స్టార్ట్ చేయగా పాము బుసలు కొట్టడం వల్ల సర్పం ఉన్నట్లు తెలిసింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు.. ఘటనాస్థలికి చేరుకుని నాగుపామును రక్షించారు.
- మనేరి భాలి ప్రాంతంలోనూ ఓ స్కూటీలోకి పాము దూరింది. దాన్ని ధామన్ జాతికి చెందిన సర్పంగా అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ఖండ్ గ్రామంలో కూడా ఆగి ఉన్న స్కూటర్‌లోకి మరో సర్పం చొరబడింది. అనేక గంటలపాటు శ్రమించిన అధికారులు.. పామును బయటకు తీశారు.
- జిల్లాలో ఈ మూడు ఘటనలు జరగ్గా.. నాలుగోది రిషికేశ్ నగరంలోనే వెలుగుచూసింది. బస్టాండ్ సమీపంలో ఉన్న మెకానిక్ షెడ్లో పాము చొరబడింది. దీంతో మెకానిక్‌లు అప్రమత్తమై ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ నాలుగు ఘటనల్లో ఎలాంటి ప్రాణం నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.