విమానాన్ని ఢీకొట్టిన పక్షి.. ఇంజిన్​లో మంటలు.. గాల్లో చక్కర్లు కొడుతూ.. - ఫ్లైదుబాయ్​ విమానంలో మంటలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Apr 25, 2023, 10:30 AM IST

ఫ్లైదుబాయ్ ఎయిర్​లైన్​కు చెందిన విమానాన్ని ఓ పక్షి ఢీకొట్టడం వల్ల ఇంజిన్​లో మంటలు చెలరేగాయి. ఇంజిన్​లో సమస్యను గుర్తించిన పైలట్లు.. కాఠ్‌మాండూలోని త్రిభువన్ అంతర్జాతీ విమానాశ్రయం ఏటీసీ (ఎయిర్​ ట్రాఫిక్​ కంట్రోలర్​)కి సమాచారం ఇచ్చారు. అనంతరం ఏయిర్​పోర్టు సమీపంలోకి వచ్చిన విమానం.. మంటలతో కొద్ది సేపు గాల్లో చక్కర్లు కొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

నేపాల్‌ రాజధాని కాఠ్‌మాండూలోని త్రిభువన్​ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 160 మంది ప్రయాణికులతో ఫ్లైదుబాయ్‌ సంస్థకు చెందిన 576 (బోయింగ్ 737-800) విమానం.. సోమవారం ఉదయం 9.20 గంటలకు దుబాయ్​కు బయలుదేరింది. కొద్ది సేపటి తర్వాత విమానాన్ని పక్షి ఢీకొట్టింది. దీంతో ఇంజిన్​లో మంటలు వ్యాపించాయి. విమానంలో మంటలు అంటుకున్నాయన్న సమాచారంతో త్రిభువన్​ మిమానాశ్రయం అప్రమత్తమైంది. ఫైర్​ ఇంజిన్​లను స్పాట్​కు తరలించింది. అయితే, ఆ తర్వాత సమస్య పరిష్కారమైందని పైలట్లు తెలిపారు. అనంతరం మరో ఇంజిన్​ సహాయంతో విమానం దుబాయ్‌లో సేఫ్​ ల్యాండింగ్ అయింది. అంతకుముందు ఎతిహాద్​ ఎయిర్​వేస్​ సంస్థకు చెందిన ఓ విమానం టేకాఫ్​ అయిన కొద్ది సేపటికే సాంకేతిక సమస్యలతో బెంగళూరు విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ అయింది.  

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.