అగ్నిప్రమాదాలు జరిగితే ఈ జాగ్రత్తలు పాటించండి - hyderabad fire station mock drill
🎬 Watch Now: Feature Video

Hyderabad Fire Station Mock Drill: అగ్ని ప్రమాదాలను అరికట్టేందుకు, నివారణ పద్ధతులు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అగ్నిమాపక సిబ్బంది అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగ స్థానిక బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్లో అగ్నిమాపక సిబ్బంది ఆధ్వర్యంలో ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై హోటల్లో పనిచేసే సిబ్బందికి అవగాహన మాక్ డ్రిల్ నిర్వహించారు. గ్యాస్ లీక్ అయిన సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చూపించారు. హోటల్ సిబ్బందితో మాక్ డ్రిల్ చేయించారు. ప్రమాదాల్లో గాయపడినవారికి ప్రథమ చికిత్స ఎలా చేయ్యాలి చూపించారు. వారికి ఎలాంటి వాతావరణం కల్పించాలో వివరించారు. ముఖ్యంగా ఇళ్లలో వంట గదిలో గ్యాస్ లీకేజ్ కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మంటలు ఎలా ఆర్పాలి అన్న అంశంపైన అవగాహన కల్పించారు. అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు మంటలను అదుపులోకి తీసుకొచ్చే పరికరాలు ఎలా వాడాలి, ఏ సమయంలో ఎలాంటి పరికరాలు ఉపయోగించాలన్న వివిధ అంశాలపై అక్కడి వారికి అవగాహన కల్పించారు.