200 దుకాణాలు దగ్ధం.. రూ.50 కోట్లు నష్టం.. జీవనాధారం కోల్పోయామని వ్యాపారుల ఆవేదన - fire accident in KEONJHAR market

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Apr 4, 2023, 10:13 AM IST

ఒడిశాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కెంధూఝర్​ పట్టణంలోని ఓ మార్కెట్​లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో దాదాపు 200 దుకాణాల వరకు దగ్ధం అయ్యాయి. సోమవారం జరిగిన ఈ ఘటనలో వ్యాపారులు రూ. కోట్లు నష్టపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఆరు ఫైర్​ ఇంజిన్లతో  మంటలను అదుపులోకి తెచ్చారు. వాటర్​ సప్లై లేని కారణంగా మంటలను ఆర్పడం ఫైర్​ సిబ్బందికి కష్టతరమైంది. అయితే, ఈ ఘటనలో ఎవరైనా చనిపోయారా? ఎవరికైనా గాయాలు అయ్యాయా? అనే విషయాల గురించి సమాచారం బయటకు రాలేదు.  

ఈ ప్రమాదంపై కెంధూఝర్ జిల్లా సబ్​ కలెక్టర్​ రామచంద్ర కిస్కు స్పందించారు. మంటలు చెలరేగడానికి కారణం ఇంతవరకు తెలియలేదని చెప్పారు. అయితే, షార్ట్​ సర్క్యూట్​ వల్లే ఈ అగ్ని ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా అనుమానిస్తున్నట్లు చెప్పారు. మంటలు చెలరేగడం వల్ల దాదాపు రూ.50 కోట్లకు పైగా ఆస్తి దగ్ధం అయినట్లు పేర్కొన్నారు. వ్యాపారులు వారి జీవనాధారమైన దుకాణాలను కోల్పోయారని రామచంద్ర కిస్కు అన్నారు. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.