జీడిమెట్ల పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం - మేడ్చల్ జిల్లా నేర వార్తలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 16, 2023, 9:18 PM IST

Heavy fire accident in Jeedimetla industrial estate: రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్​ నగరంలోని ఎక్కువగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. రెండు నెలల క్రితం సికింద్రాబాద్​లో జరిగిన అగ్ని ప్రమాద ఘటన.. ఆ తర్వాత జీడిమెట్ల పారిశ్రామిక వాడలో జరిగిన భారీ అగ్ని ప్రమాదం మరవకముందే.. మళ్లీ మేడ్చల్​ జిల్లాలోని జీడిమెట్ల పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. జీడిమెట్లలోని కోపల్లే ఫార్మా పరిశ్రమలో మంటలు చెలరేగాయి. ఫార్మా, రసాయన పరిశ్రమలో ఈ మంటలు ఎగిసిపడుతున్నాయి. సాల్వెంట్స్​ డ్రమ్స్​ గాల్లోకి ఎగురుతూ శబ్దాలతో పేలుతున్నాయి. డ్రమ్ములు పేలుతుండటంతో చుట్టు పరిసరాల్లోని ప్రజలు భయాందోళనలతో గడుపుతున్నారు. ఆ ప్రాంతంలోని ఆ పరిశ్రమకు దగ్గరలో ఉన్న జనప్రియ, మోదీ అపార్ట్​మెంట్​ వాసులు భీతిల్లుతున్నారు. ఇంకా ఈ సంఘటన స్థలానికి ఫైరింజన్​లు వెళ్లనట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఆ కంపెనీలో ఎవరైనా చుక్కుకున్నారా అనే విషయం తెలియాల్సి ఉంది. ఆ ప్రాంతం మొత్తాన్ని దట్టమైన పొగలు అలుముకున్నాయి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.