Film Actor Anji valguman : అయిదు రూపాయాల భోజనం చేస్తూ.. అవకాశాల కోసం ఆరాటం - Telangana latest news
🎬 Watch Now: Feature Video
Film Actor Anji valguman : హైదరాబాద్లో అన్నపూర్ణ క్యాంటిన్ల వద్ద ఐదు రూపాయల భోజనం చేస్తూ సినిమా అవకాశాల కోసం ఆరాటపడిన గద్వాల్ కుర్రాడు.. తన 15 ఏళ్ల కలను సాకారం చేసుకున్నాడు. తనే అంజి వల్గమాన్. ఇవాళ వెండితెరపై కనువిందు చేస్తున్నాడు. అచ్చమైన తెలంగాణ కథల్లో మంచి మంచి పాత్రల్లో కనిపిస్తూ ప్రేక్షకులను నవ్విస్తూ నటుడిగా కొత్త జీవితాన్ని మొదలుపెట్టాడు. పేరు పక్కన బాబు అని పెట్టుకుంటే సినీ పరిశ్రమ ఎక్కడ దూరం పెడుతుందోనని తన ఇంటిపేరుని చేర్చుకున్నాడు. రంగస్థలం అనుభవంతో నటుడిగా వరుస అవకాశాలు అందుకుంటోన్న అంజి వల్గమాన్.. భీమదేవరపల్లి బ్రాంచి చిత్రంతో కథానాయకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఈ సందర్భంగా తన నట ప్రయాణాన్ని పంచుకున్న అంజి.. కథ బలం ఉన్న చిత్రాలకు కథానాయకులతో పనిలేదంటున్నాడు. అలాంటి కోవకే చెందిన భీమదేవరపల్లి బ్రాంచి చిత్రం తన సినిమా కష్టాలను దూరం చేస్తోందని బలంగా విశ్వసిస్తోన్న అంజితో ప్రత్యేక ముఖాముఖీ.