9 పిల్లలకు జన్మనిచ్చిన కుక్క- 400 మందికి గ్రాండ్‌గా పార్టీ ఇచ్చిన యజమాని - 9పిల్లలకు జన్మనిచ్చిన పెంపుడు కుక్క
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/09-11-2023/640-480-19985361-thumbnail-16x9-female-dog-gives-birth-9-puppies.jpg)
![ETV Bharat Telugu Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telugu-1716536082.jpeg)
Published : Nov 9, 2023, 6:48 PM IST
Female Dog Gives Birth 9 Puppies : పెంపుడు కుక్కలను అల్లారుముద్దుగా పెంచుకుంటారు కొందరు. శునకాల బర్త్‌డేను సైతం ఘనంగా చేస్తుంటారు. అయితే ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ మహిళ తన పెంపుడు శునకం.. 9 కుక్క పిల్లలకు జన్మనివ్వడం వల్ల ఆనందంలో తేలిపోయింది. ఈ క్రమంలో 400 మందికి పార్టీ ఇచ్చింది.
అసలేం జరిగిందంటే..
హామిర్‌పుర్‌లోని మేరాపుర్‌కు చెందిన రాజ్‌కాళి అనే మహిళ 'చట్నీ' అనే కుక్కను గత కొంతకాలంగా పెంచుతోంది. ఆ కుక్క ఇటీవలె 9 పిల్లలకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో గ్రామస్థులు, బంధువులకు రాజ్‌కాళి బుధవారం విందును ఏర్పాటు చేసింది. అంతేగాక కుక్క పిల్లలను అందంగా అలకరించింది. కుక్క పిల్లల కాళ్లకు పారాణి సైతం పెట్టింది. విందుకు హాజరైన అతిథులు పాటలు పాడారు. అంతేగాక డ్యాన్స్ కూడా చేశారు.
"చట్నీ అనే శునకం వరుసగా మూడో ఏడాది ఒకేసారి 9 కుక్క పిల్లలకు జన్మనిచ్చింది. చట్నీ మా జీవితంలోకి వచ్చినప్పటి నుంచి మా కష్టాలు తీరాయి. ఎల్లవేళలా చట్నీ మా ఇంటి దగ్గరే ఉంటుంది. చట్నీకి పుట్టిన కుక్క పిల్లలన్నీ ఆరోగ్యంగా ఉన్నాయి. అందుకే సన్నిహితులకు విందు ఇచ్చా" అని రాజ్‌కాళి తెలిపారు.