Farmers Attempts To Suicide : కలెక్టరేట్లో భూనిర్వాసితుడి ఆత్మహత్యాయత్నం - తెలంగాణ తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
Farmers Attempts To Suicide At Collector Office : సిద్దిపేట కలెక్టరేట్ ప్రజావాణిలో ఓ భూనిర్వాసితుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. గతంలో కలెక్టర్ కార్యాలయం నిర్మాణంలో భూములు కోల్పోయిన వారందరికీ పూర్తి స్థాయిలో పరిహారం చెల్లించాలంటూ ఈ సందర్భంగా బాధితులు డిమాండ్ చేశారు. దుద్దేడ గ్రామం పరిధిలో 165 మంది నుంచి 345 ఎకరాలు భూమి సేకరించిన అధికారులు, ఇచ్చిన హామీలను ఇప్పటి వరకూ నెరవేర్చలని ఆవేదన వ్యక్తం చేశారు. భూమి తీసుకునే సమయంలో తమకు ప్లాట్‌తో పాటు బోరు బావులు, చెట్లకు రూ.లక్ష 25వేలు , ఎకరానికి రూ.8లక్షలు, ఇంటికో ఉద్యోగం ఇస్తామని అధికారులు హామీలు ఇచ్చి, భూమిని లాక్కున్నారని ఆరోపించారు.
కాస్తోకూస్తో ఇచ్చి పక్కకు జరిపారు: సంవత్సరాలు గడుస్తున్నా, తన గోడు పట్టించుకోవడం లేదన్న మనస్తాపంలో పెట్రోల్ పోసుకున్నట్లు బాధితులు తెలిపారు. ఎండ్లు గడిచిన ఎన్నిసార్లు కలెక్టర్‌కు మొరపెట్టుకున్నా మాకు న్యాయం చేయడం లేదు అని ఎకరానికి రూ.8 లక్షలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారనీ బాధితులు ఆరోపించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం ఆవరణలో తమకు న్యాయం చేయాలని బైఠాయించారు. న్యాయం చేసే వరకు ఇక్కడ నుంచి వెళ్లేది లేదని స్పష్టం చేశారు. తాము ఎంతటి త్యాగానికైనా సిద్ధమేనని తెలిపారు.