Exotic Animals display in Hyderabad pub : పబ్​లో పాములు, తొండలతో.. 'వైల్డ్ జంగిల్ పార్టీ' - hyderabad news

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 30, 2023, 1:09 PM IST

Updated : May 30, 2023, 2:03 PM IST

Exotic Animals display in Hyderabad pub : హైదరాబాద్​లో వీకెండ్స్​ వస్తే చాలు పబ్​లకు క్యూ కడుతూ ఉంటారు యువతీయువకులు. ఇక కస్టమర్లను ఆకర్షించేందుకు పబ్ నిర్వాహకులు పడే ఆపసోపాలు అంతా ఇంతా కాదు. రకరకాల ఫెస్టులతో.. ఆఫర్లతో వారిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తారు. అలా హైదరాబాద్​ జూబ్లీహిల్స్​లోని ఓ పబ్ చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ పబ్ నిర్వాహకులు నిర్వాకం చూసి నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇంతకీ ఆ పబ్​లో ఏం జరిగింది..? నిర్వాహకులు చేసిన పనేంటి..? ఇందులో అటవీ అధికారులు, పోలీసులు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు..? 

Wild Jungle party in Hyderabad Pub : జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక పబ్​లో వన్యప్రాణులు ప్రత్యక్షమయ్యాయి. ఈ పబ్​లో వైల్డ్ జంగిల్ పార్టీ పేరుతో ఓ ఈవెంట్​ను నిర్వహించారు. అందులో భాగంగా వన్యప్రాణులను ప్రదర్శనకు ఉంచారు. అక్కడికి వచ్చిన కస్టమర్లు ఆ వన్యప్రాణులను చేతిలో తీసుకుని వికృతంగా ప్రవర్తించారు. కొందరు వాటితో ఫొటోలు దిగితే.. మరికొందరు డ్యాన్స్ చేస్తూ వీడియోలు తీసుకున్నారు. పిల్లి, పాము, తొండ ప్రాణాలను పబ్బుకు వచ్చిన వారు పట్టుకోవడం, ఒంటిమీద వేసుకుంటూ చిత్రవిచిత్రంగా ప్రవర్తించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

ఈ వీడియోలు చూసిన నెటిజన్లు మండిపడుతున్నారు.  విషయం బయటకు రావడంతో కొందరు వ్యక్తులు... పోలీసులు, అటవీ అధికారులకు ఫిర్యాదు చేశారు. వన్యప్రాణులను పబ్బులో ప్రవేశపెట్టి ఆటవికంగా ప్రదర్శించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. 
ఈ ఘటనపై పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. ఘటనకు సంబంధించి పబ్ నిర్వాహకుడు వినయ్ రెడ్డిని అదుపులోకి తీసుకుని అటవీ అధికారులకు అప్పగించారు. వినయ్‌రెడ్డిని విచారించేందుకు కేబీఆర్ ఉద్యానవనంకు తరలించినట్లు అటవీ రేంజ్ అధికారి అనురాధ వెల్లడించారు. ఈ మేరకు సదరు పబ్‌లో అటవీ శాఖ అధికారుల తనిఖీలు నిర్వహించారు. 

Last Updated : May 30, 2023, 2:03 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.