ETV Bharat / health

మంచినీళ్లు తాగితే తలనొప్పి తగ్గుతుందట! - పరిశోధనలో కీలక విషయాలు! - HEADACHE AND DRINKING WATER

-జీవనశైలి మార్పులతో చాలా మందిని వేధిస్తున్న తలనొప్పి - తాగునీటితో చెక్ పెట్టవచ్చంటున్న నిపుణులు!

Relation Between Headache and Drinking Water
Relation Between Headache and Drinking Water (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 11, 2025, 4:19 PM IST

Relation Between Headache and Drinking Water: ఈ రోజుల్లో చాలా మంది తలనొప్పితో బాధపడుతున్నారు. కొందరికి గంటల్లో తగ్గిపోతే, మరికొందరికి రోజుల వరకూ ఉంటుంది. మరి, దీనికి కారణమేంటి అన్నది చాలా మందికి తెలియదు. మాత్రలు వేసుకుంటూ ఉంటారు. కానీ, కొన్ని తలనొప్పులు నీళ్లు తాగితే తగ్గిపోతాయని చెబుతున్నారు నిపుణులు! ఆ వివరాల కోసం ఓ లుక్కేయండి.

రోజులో ఎదురయ్యే ఒత్తిడితోపాటు పరోక్షంగానూ కొన్ని అంశాలు తలనొప్పికి దారితీయొచ్చని, అందులో డీహైడ్రేషన్​ కూడా ఒకటంటున్నారు నిపుణులు. బాడీలో నీటిశాతం తగ్గినా (డీహైడ్రేషన్‌) తలనొప్పి రావొచ్చట! మానవ మెదడు దాదాపు 73 శాతం నీటితోనే నిర్మితమై ఉంటుందని, సరిపడా నీళ్లు తాగకపోతే శరీరంలో రక్తం పరిమాణం తగ్గి మెదడుకు ఆక్సిజన్​ సరఫరా క్షీణిస్తుందని అంటున్నారు. దీంతో రక్తనాళాలు ఉబ్బుతాయని అంటున్నారు. అలాగే ఒంట్లో నీరు తగ్గినప్పుడు మెదడు తాత్కాలికంగా కుంచించుకుపోతుందని, దీంతో మెదడు పుర్రె నుంచి కాస్త వెనక్కి జారి, నొప్పికి దారితీస్తుందని అంటున్నారు. ఈ పరిణామాలన్నీ తలనొప్పికి దారితీస్తాయని హెచ్చరిస్తున్నారు. ఈ నొప్పిని తగ్గించుకోవడానికి రోజూ తగినంత నీరు తాగాలని సూచిస్తున్నారు.

పలు పరిశోధనలు సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. నేషనల్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ హెల్త్​కు సంబంధించిన నేషనల్​ లైబ్రరీ ఆఫ్​ మెడిసిన్​లో దీనికి సంబంధించిన వివరాలు ప్రచురితమయ్యాయి. వాటి ప్రకారం తలనొప్పి తగ్గేందుకు నీరు తాగడం మంచిదని సూచించారు(రిపోర్ట్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి). సుమారు 18 నుంచి 45 సంవత్సరాల వయసు గల 256 మహిళలపై క్రాస్​ సెక్షనల్​ డివైజ్​ ఉపయోగించి సుమారు నెలరోజుల పాటు చేసిన పరిశోధనలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. అయితే దీనిపై పూర్తి క్లారిటీ కోసం మరిన్ని అధ్యయనాలు చేయాలని స్పష్టం చేశారు.

తలనొప్పికి ఇతర కారణాలు:

సరిగా తినకపోవటం: భోజనానికీ భోజనానికీ మధ్య గ్యాప్​ ఎక్కువ ఉన్నా తలనొప్పి రావొచ్చని నిపుణులు అంటున్నారు. తరచూ తలనొప్పితో బాధపడేవారు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచిస్తున్నారు. అంతేకాకుండా కొందరికి పిండి పదార్థాలు, మిఠాయిల వంటివి తిన్నప్పుడూ నొప్పి వస్తుండొచ్చని, అలాంటి సమయాల్లో ఆయా పదార్థాలకు దూరంగా ఉండటం మంచిదంటున్నారు.

భంగిమ దెబ్బతినటం: సరిగా కూర్చోకపోవటం, నిలబడకపోవటం వల్ల తల, మెడ, దవడలు, భుజాల వెనక కండరాలు ఒత్తిడికి లోనవుతాయంటున్నారు. ఎక్కువసేపు ఇలాగే కొనసాగితే అక్కడి నాడుల మీదా ఒత్తిడి పెరుగుతుందని తద్వారా ఈ పరిస్థితి తలనొప్పికి దారితీస్తుందని చెబుతున్నారు.

మద్యం: మద్యం తాగడం వల్ల యూరిన్​ ఎక్కువగా వస్తుంది. మూత్రంతో పాటు ఉప్పు, విటమిన్లు, ఖనిజాలూ బయటికి పోతాయని, అందువల్ల తలనొప్పి రావొచ్చని వివరిస్తున్నారు. ఇలాంటి అలవాట్లను మార్చుకున్న తర్వాత కూడా తలనొప్పి వేధిస్తూ ఉంటే గనక తప్పకుండా వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

NOTE: ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

తరచుగా మైగ్రేన్ తలనొప్పి వేధిస్తోందా? - నిపుణులు సూచిస్తున్న సూపర్ డైట్!

నిద్ర లేవగానే తలనొప్పి వేధిస్తోందా? - అయితే కారణాలు ఇవే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.