'ప్రజా సమస్యలను అసెంబ్లీలో వినిపించాలకుంటున్న బర్రెలక్కకు నేను సపోర్ట్ చేస్తాను' - బర్రెలక్కకు మద్దతుగా విశ్రాంత ఐపీఎస్ లక్ష్మీనారాయణ
🎬 Watch Now: Feature Video
Published : Nov 26, 2023, 4:41 PM IST
Ex IPS Laxminarayan Support Barrelakka in Telangana Assembly Elections : ప్రజా సమస్యలు పరిష్కారం కావాలంటే యువత ఎన్నికలలో పాల్గొనాలని సీబీఐ మాజీ సంయుక్త సంచాలకులు లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవంలో లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైందని దానిని వృధా చేయొద్దని విద్యార్థులకు సూచించారు. యువత రాజకీయాల్లోకి వస్తే .. దేశం రూపురేఖలు మారిపోతాయని ధీమా వ్యక్తం చేశారు. వారి ఆలోచన విధానాలు దేశాన్ని అభివృద్ధి మార్గంలో నడిపిస్తాయని పేర్కొన్నారు. ప్రస్తుత రాజకీయాల్లోకి యువత పాత్ర ఎంతో అవసరం ఉందన్నారు.
రాజకీయాల్లోకి వచ్చ యువతకు తాను ఎప్పుడు సపోర్ట్‌గా ఉంటానని తెలిపారు. తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థినిగా బరిలో ఉన్న శిరీష అలియాస్ బర్రెలక్కకు తాను మద్దతు ప్రకటిస్తున్నానని చెప్పారు. ఎన్నికల గురించి కొన్ని సూచనలు ఇచ్చామని తెలిపారు. ఆమెను గెలిపించాలని ప్రజలకు సూచించారు. ఓటింగ్ శాతం పెరిగితే.. ఎన్నికల్లో.. రాజకీయాల్లో ధన ప్రభావం తగ్గుతుందని అభిప్రాయపడ్డారు.
TAGGED:
barrelakka election campaign