thumbnail

By

Published : Apr 11, 2023, 10:43 PM IST

ETV Bharat / Videos

దుకాణాలు... కొత్తరూల్స్‌ ఎలా?

Pratidwani: ఇక రాష్ట్రంలో 24 గంటలూ దుకాణాలు ఓపెన్‌ చేసుకోవచ్చు. రేయింబవళ్లూ క్రయవిక్రయాలు సాగించవచ్చు. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వ్యులపైనే ఇప్పుడు అందరి దృష్టి కూడా నెలకొంది. బిజినెస్ పెంచుకోవడం, అంతర్జాతీయ నగరాల తీరులో చేరేందుకు ఈ నిర్ణయం తీడ్పడుతుందని అధికారులు అంచనావేస్తున్నారు. విదేశాల్లోని చాలా నగరాల్లో తెల్లవారుజాము వరకు షాపులు తెరిచే ఉంటాయి. అదే పద్ధతిని ఇక్కడా ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఇందువల్ల వ్యాపార లావాదేవీలు పెరగడంతో పాటు.. ఇతర వాణిజ్య ప్రయోజనాలు ఉన్నాయి.  మరి ఉన్నట్లుండి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం వెనక నేపథ్యం ఏమిటి? ఏ ప్రయోజనాలు ఆశించి ఈ మార్పుని తీసుకుని వస్తున్నారు? మన నగరంలో అంత వ్యాపార అవకాశాలు ఉన్నాయా.. తెల్లవార్లు దుకాణాలు తెరిచినా.. ప్రజలు ఆదరిస్తారా... ఈ నిర్ణయం ఏ ఏ షాపులకూ వర్తిస్తుంది? ఇలా రోజంతా వ్యాపారం చేసుకోవడానికి మళ్లీ ప్రత్యేకించి దరఖాస్తులు పెట్టుకోవాలా? ఎంతమొత్తంలో ఫీజులు కట్టాలి? ఇవన్నీ ఒకెత్తైతే.. మానవ వనరులు, భద్రతపరంగా అధిగమించాల్సిన సవాళ్లు ఏమిటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.