Etela Rajender Fires on CM KCR : ఓడిపోతామనే.. కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేస్తున్నారు: ఎమ్మెల్యే ఈటల రాజేందర్ - బీజేపీ కార్యాలయం

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Aug 30, 2023, 4:12 PM IST

Etela Rajender Fires on CM KCR : ఓడిపోతామనే నమ్మకం ఉంది కాబట్టే.. కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేయడానికి సిద్ధమయ్యారని, ఈ నిర్ణయంతో బీఆర్ఎస్ ఓటమిని అంగీకరించినట్లేనని బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ అన్నారు. సంగారెడ్డి జిల్లా బీజేపీ కార్యాలయంలోని ఉమ్మడి జిల్లా నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కేసీఆర్ పథకాల పేరుతో ప్రజలను మోసం చేశారని, కుటుంబ పాలన చేస్తూ.. తెలంగాణను అప్పుల పాలు చేస్తున్నారని ఆరోపించారు.

ఈ క్రమంలోనే బీఆర్ఎస్​కు సీట్లు తక్కువగా వచ్చినా.. కాంగ్రెస్​తో పొత్తు పెట్టుకొని గద్దె ఎక్కేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటేనని.. ఎవరికి ఓటు వేసినా కేసీఆర్​కు వేసినట్లేనని చెప్పారు. కేసీఆర్ సర్కార్ ఓట్ల సమయంలో పథకాల ఆశ చూపిస్తూ.. ప్రజలను తమ వైపు తిప్పుకుని గెలవాలన్ ఆశతో ఉన్నారని విమర్శించారు. దీనిని ప్రజలు గమనించి బీజేపీ పార్టీని గెలిపించాలని కోరారు. బీజేపీ ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటుందని వివరించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.