ED Raids on transstroy మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇల్లు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు.. - ట్రాన్స్‌స్ట్రాయ్ కంపెనీ
🎬 Watch Now: Feature Video
Enforcement Directorate Raids in Rayapati Sambasiva Rao House: ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ డైరెక్టర్ల ఇళ్లు కార్యాలయాల్లో ఈడి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ డైరెక్టర్లుగా ఉన్న మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు, మలినేని సాంబశివరావుతో పాటు ఇతర డైరెక్టర్ల ఇళ్లు కార్యాలయాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్, గుంటూరులోని ఇళ్లు, కార్యాలయాలు కలుపుకుని ఇలా 9 ప్రాంతాల్లో అధికారులు ఒకేసారి సోదాలు నిర్వహిస్తున్నారు. సీబీఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు మనీ లాండరింగ్ కింద కేసు నమోదు చేసి సోదాలు చేపట్టారు. ట్రాన్స్ట్రాయ్ కంపెనీపై గతంలోనూ సీబీఐ కేసు నమోదు చేయగా.. ప్రస్తుతం జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 27లో ఉన్న రాయపాటి సాంబశివరావు ఇంట్లో ఈడి అధికారులు సోదాలు చేపట్టారు. దాదాపు 13 బ్యాంకుల నుంచి 9వేల కోట్లకు పైగా రుణాలను ట్రాన్స్ట్రాయ్ కంపెనీ తీసుకుంది. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను డొల్ల కంపెనీలకు మళ్లించినట్లు సీబీఐ కేసు నమోదు చేసింది. ట్రాన్స్ట్రాయ్ కంపెనీకి చెందిన బ్యాంకు ఖాతాల నుంచి సింగపూర్‌కు నిబంధనలకు విరుద్ధంగా నగదు బదిలీ అయినట్లు ఈడీ అనుమానం వ్యక్తం చేస్తోంది.