తొండంతో గుడి తలుపులు తీసిన ఏనుగు 'అఖిల' - తమిళనాడు జంబుకేశ్వరార్ అఖిలాండేశ్వరి
🎬 Watch Now: Feature Video
తమిళనాడు, తిరుచిరాపల్లి జిల్లాలోని తిరువనైకావల్లోని జంబుకేశ్వరార్ అఖిలాండేశ్వరి దేవాలయంలోని 'అఖిల' అనే ఓ బుల్లి ఏనుగు.. ఆలయ ద్వారాలు తెరిచింది. తన తొండంతో సులువుగా గుడి తలుపులు తీసింది. బుధవారం మధ్యాహ్నం ఈ సంఘటన జరిగింది. ఏనుగు గుడి తలుపులు తీయడాన్ని వీడియో తీసిన ఆలయ సిబ్బంది.. అనంతరం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్గా మారింది.