పానీపూరిలు లాగించిన ఏనుగు.. ఒకటి కాదు రెండు కాదు.. నాన్‌స్టాప్‌గా.. - ఏనుగు పానీపూరి తినడం
🎬 Watch Now: Feature Video
పానీపూరి అంటే చాలా మంది ఎంతో ఇష్టంగా తినేస్తారు. అయితే, అసోంలోని తేజ్‌పుర్‌లో ఓ ఏనుగు ఎంతో బుద్ధిగా పానీపూరి లాగించేసింది. మావటి వాడు ఏనుగును పానీపూరి బండి వద్దకు తీసుకువచ్చాడు. దీంతో ఏనుగు ఆ బండివాడు ఇచ్చిన ఒక్కో పానీపూరిని తొండంతో తీసుకొని తినేసింది. ఏనుగు పానీపూరి తినడం చూసి స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST