raghunandanrao: 'ప్రశ్నించడం షురూ చేశాక.. బెదిరింపులు కాల్స్ ఎక్కువయ్యాయి' - Dubbaka MLA Raghunandan Rao news
🎬 Watch Now: Feature Video
Dubbaka MLA Raghunandan Rao meets telangana DGP: అపరిచిత వ్యక్తుల నుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని.. ప్రస్తుతమున్న భద్రతను రెట్టింపు చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు డీజీపీ అంజనీ కుమార్ను కోరారు. ఈ విషయంలో గతేడాది ఏప్రిల్లో భద్రత పెంచాలని దరఖాస్తు చేశానని.. మళ్లీ ఈ రోజు డీజీపీని కలిసి మరోసారి దరఖాస్తు ఇచ్చినట్లు తెలిపారు. అయితే డీజీపీ అందుబాటులో లేకపోవడంతో అడిషనల్ డీజీపీకి మరోసారి దరఖాస్తు అందించానని అన్నారు.
ఇప్పటి వరకు తానిచ్చిన దరఖాస్తుపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని అడిగితే అధికారుల నుంచి మౌనమే సమాధానంగా కనిపించిందని రఘునందన్ రావు మండిపడ్డారు. జూబ్లీహిల్స్ రేప్ కేసులో ప్రముఖుల పాత్ర, బాహ్యవలయ రహదారి టోల్ ఐఆర్‌బీ ఇన్ ఫ్రాకు అప్పగించడం వంటి అంశాలు.. గతంలో ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా అక్రమాలపై ప్రశ్నించిన సతీష్ అనే వ్యక్తిని దారుణంగా హతమార్చిన విషయాన్ని అధికారులకు వివరించినట్లు తెలిపారు. 2014 నుంచి ఇప్పటివరకు పోలీస్ శాఖ కొనుగోలు చేసిన వాహనాల గురించి సమాచార హక్కు చట్టం ద్వారా అడిగానని చెప్పారు.