మత్తులో పాముతో చెలగాటం.. చేతికి చుట్టుకొని ఆటలు.. రెండుసార్లు కాటేయగానే.. - పాము వైరల్ న్యూస్
🎬 Watch Now: Feature Video
కర్ణాటక తుమకూరులో ఓ వ్యక్తి మద్యం మత్తులో హల్చల్ చేశాడు. స్థానికంగా వెల్డింగ్ పనిచేసుకొనే సలీమ్.. ప్రమాదకర రీతిలో ఓ నాగుపామును వెంబడించి చేతితో పట్టుకున్నాడు. పామును చెయ్యికి చుట్టేసుకున్నాడు. అనంతరం అటూఇటూ తిరిగాడు. చుట్టుపక్కల వారు ఎంతగా వారించినా.. వారి మాటలు వినిపించుకోలేదు సలీమ్. ఈ క్రమంలో పాము అతడి చెయ్యిని రెండుసార్లు కాటేసింది. అయినా సర్పాన్ని విడిచిపెట్టలేదు. మూడోసారి కాటేస్తుండగా.. పాము అతడి చేతుల్లో నుంచి జారిపోయింది. దీంతో పాములు పట్టే వ్యక్తి దిలీప్ అక్కడికి చేరుకొని.. సర్పాన్ని బంధించి దేవరాయనదుర్గ అడవిలో విడిచిపెట్టాడు. పాముకాటుకు గురైన సలీమ్‌ను స్థానికులు తుమకూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అతడిని ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. అయితే, బాధితుడు అక్కడి నుంచి పారిపోయాడు. ప్రస్తుతం అతడి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు వెతుకుతున్నారు.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST