మందుబాబులకు పేపర్‌తో బ్రీత్ అనలైజర్ టెస్ట్! వాసన చూసి నిర్ధరించిన డాక్టర్లు
🎬 Watch Now: Feature Video
Published : Nov 2, 2023, 9:35 PM IST
drinking Alcohol Test By Blowing On Paper : పేపర్‌తో మందుబాబులకు బ్రీత్ అనలైజర్ పరీక్ష చేసినట్లు కనిపిస్తున్న వీడియో వైరల్‌గా మారింది. బ్రీత్ అనలైజర్ పరికరం అందుబాటులో లేకపోవడం వల్ల పేపర్‌తోనే పరీక్ష చేశారట వైద్యులు. ఓ పేపర్‌ను గుండ్రంగా చుట్టి.. అందులో నిందితులను గాలి ఊదమన్నట్లుగా ఈ వీడియోలో కనిపిస్తోంది. అనంతరం ఆ పేపర్ వాసన చూసిన వైద్యులు.. మద్యం సేవించారా? లేదా అన్న విషయం తెలుస్తుందని అన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన బిహార్‌లోని మోతీహరిలో జరిగింది.
ఇదీ జరిగింది
భారత్-నేపాల్ సరిహద్దులోని రక్సౌల్‌లోని బాటా చౌక్ ప్రాంతంలో 11 మంది మందుబాబులను అరెస్ట్ చేశారు పోలీసులు. వీరందరూ రాష్ట్రంలో మద్యపాన నిషేధం ఉండడం వల్ల నేపాల్ వెళ్లి మందు తాగి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే వారిని రక్సౌల్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. వైద్యులు పేపర్‌తో బ్రీత్ అనలైజర్ పరీక్ష చేశారు. ఇందులో 9 మంది మద్యం తాగినట్లు తేలింది. వైద్యులు ఇచ్చిన నివేదికతో.. వారిని మోతీహరి కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు. వారు మద్యం సేవించినట్లు నివేదిక ఇచ్చిన వైద్యులు.. ఎంత శాతం తాగారనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. ఆస్పత్రిలో బ్రీత్ అనలైజర్ లేకపోవడం వల్లే ఇలా చేశామని ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ రాజీవ్ రంజన్ చెప్పారు. ఈ పరీక్ష కేవలం ప్రాథమికంగా మద్యం తాగాడా లేడా అన్నది తెలుస్తుందని.. ఎంత శాతం సేవించారనేది తెలియదన్నారు.