డబుల్ బెడ్ రూం ఇళ్ల పేరుతో వసూళ్లు - ఇంటికి రూ.1000 చొప్పున రూ.లక్ష జేబులో వేసుకున్న ప్రతిపక్ష నేత - తెలంగాణ డబుల్ బెడ్ రూం స్కీమ్
🎬 Watch Now: Feature Video


Published : Dec 23, 2023, 4:59 PM IST
Double Bedroom Houses Issue in Kamareddy : డబుల్ బెడ్ రూం(2BHK Housing Scheme)ల వద్ద బాధితులు ఆందోళన చేపట్టారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 22వ వార్డులోని డ్రైవర్స్ కాలనీలో డబుల్ బెడ్ రూంలకు సంబంధించి పట్టాతో పాటు విద్యుత్ కనెక్షన్ ఇప్పిస్తానని స్థానిక బీఆర్ఎస్ నాయకుడు ఆసిఫ్ ఇంటికి రూ.1000 చొప్పున లక్ష రూపాయల వరకు వసూలు చేశాడని బాధితులు ఆరోపిస్తూ నిరసన చేపట్టారు. డబ్బులు వసూలు చేస్తున్నాడని అధికారులు దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Double Bedroom Houses Protest at Kamareddy : డబుల్ బెడ్ రూం ఇళ్లకు సంబంధించి పట్టాతో పాటు విద్యుత్ కనెక్షన్ ఇప్పిస్తామని స్థానిక కౌన్సిలర్ అనుచరుడు ఆసిఫ్ ఒక్కొక్క ఇంటి నుంచి రూ.1000 చొప్పున లక్ష రూపాయలు తీసుకున్నారని ఆరోపించారు. ప్రభుత్వమే అన్ని సౌకర్యాలు కల్పించాల్సింది పోయి ఇలా డబ్బులు వసూలు చేయడం ఏంటని ఆగ్రహించారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు కేటాయించి మూడు నెలలు అవుతున్నప్పటికీ ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. ఇలా డబ్బులు వసూలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.