Double Bedroom Beneficiaries interview : ''సొంతింటి కల' నెరవేరుతుందని కల్లోకూడా ఊహించలేదు'
🎬 Watch Now: Feature Video
Kollur Double Bedroom Beneficiaries : పూట గడిచినా గడవకపోయినా ఇంటి అద్దె కట్టాల్సిందే. ఒకటో తారీఖు వచ్చిందంటే చాలు ఇల్లు అద్దెకుంటున్న ప్రతి కుంటుంబానికి ఇదో గుబులు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఆ బాధను అర్థం చేసుకుంది. తెలంగాణ పేద ప్రజల కల నేరవేర్చింది. ఇళ్లు లేని నిరాశ్రయులకు సొంతింటి కళను నిజం చేసింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకాన్ని తీసుకువచ్చి పేద ప్రజలు ఆత్మగౌరవంతో బతికేందుకు సాయపడుతోంది. ఇందులో భాగంగా.. సంగారెడ్డి జిల్లా కొల్లూరులో 15 వేలకు పైగా డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించి పేదలను ఇంటి యజమానులను చేసింది. ఆసియాలోనే అతిపెద్ద సామాజిక గృహ సముధాయంలో ఇళ్లు పొందిన మొదటి లబ్ది దారులు భావోద్వేగానికి గురవుతున్నారు. తాము చేసే కష్టం కుటుంబ పోషణకే సరిపోయేదని.. సొంత ఇల్లు తమకు కలగా ఉండేదని వారు అంటున్నారు. సంవత్సరాల తరబడి ఇరుకు ఇంటిలో కిరాయికి ఉన్న తాము ఇక నుంచి విశాలమైన సొంత ఇంటిలో ఉండబోతున్నామని ఆనంద భాష్పాలు రాలుస్తున్నారు. ఒకరు తిన్నాకనే ఇంకొకరు తినడానికి సరిపోయే ఇండ్లల్లో ఉన్నామని వారి బాధను చెప్పుకున్నారు. కేసీఆర్ చేతుల మీదుగా ఇంటి తాళాలు అందుకున్న లబ్దిదారులతో మా ప్రతినిధి క్రాంతికుమార్ ముఖాముఖి.