Dog Attack Woman Viral Video : డాక్టర్ భార్యపై వీధి కుక్కల దాడి.. లెగ్ ఫ్రాక్చర్!.. ప్రస్తుతం ఎలా ఉందంటే? - street dog bite woman latest news
🎬 Watch Now: Feature Video
Published : Sep 16, 2023, 8:30 AM IST
|Updated : Sep 16, 2023, 10:08 AM IST
Dog Attack Woman Viral Video : దేశ రాజధాని దిల్లీలో మరోసారి వీధి కుక్కలు బీభత్సం సృష్టించాయి. వసంత్‌కుంజ్ ప్రాంతంలో ఓ మహిళపై వీధి కుక్కలు తీవ్రంగా దాడి చేశాయి. వెంటనే స్థానికులు మహిళను ఆస్పత్రిగా తరలించగా.. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. సెప్టెంబర్ 11వ తేదీ సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డ్ అయిన సీసీటీవీ దృశ్యాలు.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Dog Bite Woman Delhi : అయితే.. అటువైపుగా బాధితురాలు వస్తున్న సమయంలో ఒక్కసారిగా ఆమెపైకి నాలుగు వీధి కుక్కలు వచ్చినట్లు వీడియోలో కనిపిస్తోంది. దీంతో ఆమె తన ప్రాణాలు కాపాాడుకునేందుకు ప్రయత్నించగా జారిపడిపోయింది. ఈ ఘటనలో బాధితురాలి కాలు ఫ్రాక్చర్ అయినట్లు సమాచారం. దిల్లీ ఎయిమ్స్‌లో ఆమె కాలుకు శస్త్ర చికిత్స జరిగినట్లు తెలుస్తోంది. ఎయిమ్స్‌లో యూరాలజిస్ట్‌గా సేవలందిస్తున్న డాక్టర్ పీఎన్ డోగ్రా భార్యనే బాధితురాలుగా అధికారులు గుర్తించారు.