అసలే జ్వరం, ఆపై వీధికుక్క దాడి- ఆస్పత్రిలో తల్లీకొడుకులు! - యువకుడిపై దాడి

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telugu Team

Published : Jan 7, 2024, 8:37 PM IST

Updated : Jan 8, 2024, 5:59 AM IST

Dog Attack On Young Man Viral Video : అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రికి వెళ్తున్న ఓ యువకుడిపై వీధి కుక్క భీకర దాడి చేసింది. కర్ణాటకలోని రాయచూరు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియా సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.

అసలేం జరిగిందంటే?
జిల్లాలోని సింధనూరులో రెండు మూడు రోజుల క్రితం ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఓ పోలీస్ కానిస్టేబుల్ కుమారుడు అనారోగ్యంగా కారణంగా చికిత్స కోసం తన తల్లితో కలిసి ఆస్పత్రికి బయలు దేరాడు. అదే సమయంలో అతడిపై వీధి కుక్క ఒక్కసారిగా దాడి చేసింది. అది గమనించిన తల్లితోపాటు స్థానికులు అతడి దగ్గరకు వెళ్లి కుక్కను తరిమేశారు. ఆ సమయంలో యువకుడి తల్లి కూడా గాయపడింది.

వెంటనే స్థానికులు తీవ్రంగా గాయపడిన తల్లీకొడుకులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ మొత్తం ఘటన అక్కడే ఉన్న సీసీటీవీల్లో రికార్డైంది. ప్రస్తుతం ఈ వీడియా సోషల్​ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఆ వీడియో చూసిన ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వీధి కుక్కల బెడదను వెంటనే అరికట్టాలని నగర పాలక సంస్థ అధికారులను కోరుతున్నారు. గతంలోనూ రాయచూరులో ఇలాంటి ఘటనలు జరిగాయని, ఇప్పటికైనా స్పందించాలని వేడుకుంటున్నారు.

Last Updated : Jan 8, 2024, 5:59 AM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.