DK Sivakumar meet Revanth, Telangana assembly election Results 2023 : రేవంత్ రెడ్డితో డీకే శివకుమార్ సంబురాలు - తెలంగాణ అసెంబ్లీ రిజల్ట్స్ 2023
🎬 Watch Now: Feature Video


Published : Dec 3, 2023, 6:24 PM IST
DK Sivakumar And Revanth, Telangana assembly election results 2023 live: తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ గెలుపొందడంతో రేవంత్ రెడ్డికి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్ స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. నిన్న రాత్రే హైదరాబాద్ వచ్చిన డీకే శివకుమార్.. ఉదయం ఫలితాల వెల్లడి మొదలైన తరువాత రేవంత్‌ను కలిశారు. తమ తదుపరి కార్యాచరణపై పార్టీ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.
ఎన్నికల్లో కాంగ్రెస్ 64 స్థానాల్లో గెలిచి విజయ సంబరాలు చేసుకుంటున్నారు. ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ గెలిచిన నేపథ్యంలో జూబ్లీహిల్స్‌లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇంటి వద్ద భద్రత పెంచారు. రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్, సీఐడీ చీఫ్ మహేశ్ భగవత్, మరి కొందరు పోలీసు అధికారులు రేవంత్ ఇంటికి వెళ్లి ఆయన్ను కలిశారు. ఫలితాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా వస్తుండటంతో గాంధీ భవన్‌కు భారీగా కార్యకర్తలు చేరుకుని సంబురాల్లో మునిగి తేలుతున్నారు. ఈనెల 9లోగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు.