'రాష్ట్రంలో కరోనా కేసుల్లేవు.. అయినా అప్రమత్తత అవసరం' - Preventive measures against sunburn
🎬 Watch Now: Feature Video

DH Srinivas on Corona cases in Telangana : దేశవ్యాప్తంగా కొవిడ్ కేసులు క్రమ క్రమంగా పెరుగుతున్నాయి. మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒమిక్రాన్ కొత్త వేరియంట్‌ను "వేరియంట్ ఆఫ్ కన్సర్న్" గా పేర్కొంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కరోనా విషయంలో జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. బూస్టర్ డోసులను అందించటంతోపాటు.. కరోనా పాజిటివ్ కేసులు ఉన్నపళంగా పెరుగుతున్న ప్రాంతాల్లో కాంటాక్టులను గుర్తించి టెస్టులు చేయాలని స్ఫష్టం చేసింది.
అయితే గత కొంత కాలంగా రాష్ట్రంలో ఒక్క కరోనా కేసు కూడా లేకపోవటం గమనార్హం. ఈ క్రమంలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ నిలిచిపోయింది. మరోవైపు రాష్ట్రంలో కుక్కకాటు బాధితుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. పలు సంఘటనల్లో కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇంకోవైపు వేసవి షురూ అయింది. ఎండలు మండిపోతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితులు సహా.. కుక్కకాటు బాధితులకు వైద్యం, వడదెబ్బ బాధితుల కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ప్రజా రోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావుతో ముఖాముఖి..