Devotees Crowd in Bhadrachalam : జన సందోహంగా భద్రాద్రి.. రామనామ స్మరణతో మార్మోగిన పురవీధులు - Calculation of Bhadrachalam Hundi
🎬 Watch Now: Feature Video
Published : Sep 24, 2023, 6:18 PM IST
Devotees Crowd in Bhadrachalam : భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకునేందుకు ఆదివారం భారీగా భక్తులు తరలివచ్చారు. దీంతో రద్దీ బాగా నెలకొంది. క్యూలైన్లలో బారులు తీరిన భక్తులు చేసే రామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. ఆద్యంతం ఎంతో ఉల్లాసంగా భక్తులు ముందుకు సాగారు. ఆదివారం సెలవు రోజు కావడంతో పలు ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. భద్రాద్రి పురవీధులు భక్త జనసందోహంగా మారాయి.
ఆదివారం సందర్భంగా ప్రధాన ఆలయంలో వేంచేసి ఉన్న లక్ష్మణ సమేత శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి పంచామృతాలతో విశేష అభిషేకం నిర్వహించారు. అనంతరం బంగారు పుష్పాలతో అర్చన చేశారు. వివిధ ప్రాంతాల నుంచి స్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు, గోదావరి నదీ తీరాన సందడి వాతావరణం నెలకొంది. సోమవారం ఆలయం వద్ద గల చిత్రకూట మండపంలో భక్తులు హుండీల ద్వారా స్వామివారికి సమర్పించిన ఆదాయాన్ని ఆలయ అధికారులు లెక్కించనున్నారు.