Delhi Gunpoint Robbery : పెట్రోల్ బంక్‌లో దుండగుల హల్చల్.. సిబ్బంది తలకు గన్ పెట్టి నగదుతో పరార్ - delhi robbery latest news
🎬 Watch Now: Feature Video
Published : Oct 12, 2023, 2:26 PM IST
Delhi Gunpoint Robbery : దిల్లీలోని ముంద్కా పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్రోల్ బంక్ సిబ్బందిని తుపాకీతో బెదిరించి నగదును దోచుకున్నారు కొందరు దుండగులు. మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. రెండు బైక్‌లపై మొత్తం ఆరుగురు దుండగులు పెట్రోల్ బంక్‌కు వచ్చారు. పెట్రోల్ పోయించుకునేందుకు వచ్చినట్లు నటించిన దుండగులు.. బంక్ సిబ్బంది తలకు తుపాకీ పెట్టి బెదిరించారు. అనంతరం సిబ్బంది వద్ద నుంచి రూ.10 వేలు దోచుకెళ్లారు. ఈ దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి.
దుండగులు పక్కా ప్లాన్‌తోనే బంక్‌కు వచ్చినట్లు తెలుస్తోంది. ఆరుగురు వ్యక్తులు తమ ముఖాలకు మాస్కులు ధరించి బంక్‌కు వచ్చారు. అక్కడ పని చేస్తున్న సిబ్బందిని తుపాకీతో బెదిరించి కొట్టారు. అతని వద్ద ఉన్న నగదును లాగేసుకున్నారు. ఈ క్రమంలో పెట్రోల్ బంకు సిబ్బంది ప్రతిఘటించటం వల్ల రెండు రౌండ్ల కాల్పులు జరిపి.. అక్కడి నుంచి పరారయ్యారు. సీసీ కెమెరాల్లో రికార్డైన ఈ దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై ముంద్కా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.