దిల్లీ డంపింగ్ యార్డులో చెలరేగిన మంటలు - డంపింగ్ యార్డ్ న్యూస్
🎬 Watch Now: Feature Video
దిల్లీ భలస్వా ప్రాంతంలోని డంపింగ్ యార్డులో.. భారీ ఎత్తున చెలరేగిన మంటలు ఇంకా పూర్తిస్థాయిలో అదుపులోకి రాలేదు. వీటిని అదుపు చేసేందుకు రంగంలోనికి దిగిన అగ్ని మాపక సిబ్బంది 15 గంటల నుంచి నిర్విరామంగా కష్టపడుతోంది. 13 ఫైరింజన్ల సాయంతో మంటల్ని ఆర్పేందుకు కృషి చేస్తోంది. మంటలు తీవ్రత తగ్గడం వల్ల భారీగా పొగలు వ్యాపిస్తున్నాయి. వీటి కారణంగా ఆ ప్రాంత వాతావరణం మరింత దారుణంగా తయారవుతోంది. డంపింగ్ యార్డ్‌లో వ్యర్థాల నుంచి వచ్చే మీథేన్ కారణంగానే.. ఈ అగ్ని ప్రమాదం జరిగిందని నిపుణులు చెప్పారు. ఈ ఏడాదిలో ఇది మూడో అగ్ని ప్రమాదం. వాటిలో నెల క్రితం మార్చి 28న చెలరెగిన మంటలు 50గంటలు వరకు కొసాగాయి.
Last Updated : Feb 3, 2023, 8:22 PM IST