పామును కసకసా నమిలి మింగేసిన జింక.. వీడియో వైరల్ - సుశాంత నంద వీడియో
🎬 Watch Now: Feature Video
Deer Eating Snake : శాకాహార జంతువైన ఓ జింక మాంసాహారాన్ని తీసుకోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఓ అడవిలో జింక ఏకంగా పామును నోటితో నమిలి మింగేసింది. ఇండియన్ ఫారెస్ట్ అధికారి సుశాంత్ నందా ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. 'ప్రకృతిని బాగా అర్థం చేసుకోవడానికి కెమెరాలు ఉపయోగపడుతున్నాయి. శాకాహారులైన జంతువులు ఒక్కోసారి పాములను కూడా తింటాయి' అనే క్యాప్షన్‌ను ఆ వీడియోకు జోడించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శాకాహార జంతువైన జింక పామును తినడం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
సుశాంత్ నందా షేర్ చేసిన వీడియోలో ఓ జింక అటవీ ప్రాంతంలో పామును నములుతూ కనిపించింది. ఈ వీడియోను చూసిన ఓ నెటిజన్.. ప్రకృతి నమ్మశక్యం కాని, కొన్నిసార్లు ఊహించని పరిణామాలతో నిండి ఉందని కామెంట్ చేశాడు. జంతువుల ప్రవర్తన, వైవిధ్యాన్ని ఈ వీడియో తెలియజేస్తుందని మరో నెటిజన్ స్పందించారు. కచ్చితంగా 'ప్రకృతి నియమం' అని ఏమీ లేదని మరో వ్యక్తి కామెంట్ పెట్టారు. శాకాహారులు కొన్ని సార్లు మాంసాన్ని తింటాయని.. కళేబరాలను కూడా నములుతాయని మరో నెటిజన్ అన్నారు.