Dagdusheth Ganpati Pune : గణపతికి మంత్ర నీరాజనం.. ఒకేసారి 35వేల మంది మహిళల ప్రార్థన.. విదేశీయులు సైతం..
🎬 Watch Now: Feature Video
Dagdusheth Ganpati Pune : దేశమంతటా గణేశ్ నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. చవితి రోజు ఇళ్లతో పాటు వీధుల్లో వినాయకుడి విగ్రహాలను పెట్టి భక్తులు.. విఘ్నేశ్వరుడికి పూజలు చేసి సంబరాలు జరుపుకున్నారు. ఇక గణేశ్ ఉత్సవాల్లో భాగంగా మహారాష్ట్రలోని దగ్డూశేఠ్ వినాయకుని వద్ద కూడా సంబరాలు అంబరాన్నంటాయి. చవితి రోజు నుంచే ఘనంగా వేడుకలు జరగ్గా.. రెండవ రోజు దాదాపు 35,000 మంది మహిళలు కలిసి ప్రార్థనలు చేశారు. దీంతో ముంబయి పుర వీధులన్నీ వినాయకుడి నామస్మరణతో మారుమోగుపోయాయి. గణపతి బప్పా మోరియా అంటూ నినాదాలు చేశారు.
ఋషి పంచమిలో భాగంగా జరిగిన ఈ వేడుకల్లో సంప్రదాయ దుస్తుల్లో పాల్గొన్న భక్తులు.. గణేశుని ముందు 'అథర్వశీర్ష' పారాయణం చేశారు. ఇందులో రష్యా నుంచి వచ్చిన విదేశీ భక్తులు కూడా పాల్గొని సందడి చేశారు. కాగా 36 ఏళ్లుగా దగ్డూశేఠ్ వినాయకునికి జరిగే చవితి వేడుకల్లో 'అథర్వశీర్ష' పారాయణాన్ని చేస్తున్నారంటూ దగ్డూశేఠ్ గణపతి కమిటీ నిర్వహకులు తెలిపారు.