Crocodiles in Narayanpet Live Video : వరదతో పాటు వచ్చేసిన మొసళ్లు.. భయపడుతున్న ప్రజలు - పసుపుల గ్రామంలో పదుల సంఖ్యలో మొసళ్లు
🎬 Watch Now: Feature Video
Crocodiles in Narayanpet : రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకి చిన్న చిన్న ప్రాణులు వరద నీటితో కొట్టుకుపోతున్నాయి. చేపలు, పీతలు, రొయ్యలు.. తదితర జీవులు. అవి వరద నీరు వెళ్లే చోటకి వెళ్లిపోతున్నాయి. అలా రైతుల పంట పొలాల్లోకి, రోడ్లు మీద చేరుతుంటాయి. అయితే అలా చేపలతో పాటు మొసళ్లు కూడా వస్తే ఆ పరిస్థితి ఎలా ఉంటుంది. వాటికి మనం చిక్కితే అంతే సంగతి! మరి ఆ గ్రామ ప్రజల పరిస్థితి ఎలా ఉంటుంది. ఎవరికైనా భయంగా ఉంటుంది కదా!.. అలాగే నారాయణ పేట జిల్లాలో కర్ణాటక సరిహద్దులోని మక్తల్ మండలం పసుపుల గ్రామంలో పదుల సంఖ్యలో మొసళ్లు కనిపించాయి. కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షానికి మొసళ్లు కొట్టుకువచ్చాయి. ఒక్కసారిగా అన్ని మొసళ్లను స్థానికులు చూడడంతో భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎగువ నుంచి వస్తున్న భారీ వరద వల్ల వచ్చాయని స్థానికులు చెబుతున్నారు. తక్షణమే అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.