బీఆర్ఎస్ 48, బీజేపీ 70, కాంగ్రెస్ 71శాతం - ఇదీ తెలంగాణలో ప్రధాన పార్టీల అభ్యర్థుల నేర చరిత్ర - Forum for Good Governance Chairman
🎬 Watch Now: Feature Video
Published : Nov 21, 2023, 1:09 PM IST
|Updated : Nov 21, 2023, 2:09 PM IST
Criminal Cases against Political Leaders in Telangana 2023 : ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునే ముందు ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల నేర చరిత్రను చూడాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఛైర్మన్ పద్మనాభరెడ్డి పేర్కొన్నారు. ఈ అంశంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు హైదరాబాద్‌లోని ప్రెస్‌క్లబ్‌లో ఆయన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రముఖంగా ఉన్న బీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం నాలుగు పార్టీల అభ్యర్థుల నేర చరిత్ర, వారిపై ఉన్న కేసులను వివరించారు. అలా నేర చరిత్ర ఉన్న వారిలో ఏయే పార్టీలు ఎంత మందికి సీట్లను కేటాయించాయో తెలిపారు.
Padmanabhareddy on Criminal cases against political leaders in Telangana : పద్మనాభరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. బీఆర్‌ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న 48 శాతం మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ తరఫున ఎన్నికల బరిలో నిలిచిన వారిలో 70 శాతం మంది అభ్యర్థులపై, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్లో అత్యధికంగా 71 శాతం మందిపై, ఎంఐఎం పార్టీ అభ్యర్థుల్లో 50 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ఆయన వివరించారు.
గెలుపు గుర్రాల వేటలో అన్ని రాజకీయ పార్టీలు నేర చరిత్ర ఉన్నవారికి టికెట్లు ఇచ్చాయని పద్మనాభరెడ్డి పేర్కొన్నారు. 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ప్రధాన పార్టీల తరఫున 360 మంది అభ్యర్థులు బరిలో నిలిచారని.. వారిలో 226 మందికి నేర చరిత్ర ఉందని తెలిపారు. ఈ కేసుల్లో ఉద్యమం సందర్భంగా కొన్ని, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినందుకు మరికొన్ని నమోదయ్యాయని వివరించారు. సగం మంది అభ్యర్థులపై భూ ఆక్రమణ, బెదిరింపులు, ఇతర నేరాలకు సంబంధించిన కేసులున్నాయన్నారు. అత్యధికంగా రేవంత్ రెడ్డి, రాజాసింగ్‌లపై 89 చొప్పున కేసులు నమోదైనట్లు స్పష్టం చేశారు. ఆ తర్వాతి స్థానాల్లో బండి సంజయ్‌పై 59, ఖానాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి వెడ్మ బొజ్జుపై 52, ఈటెల రాజేందర్‌పై 44 కేసులు ఉన్నాయని ఆయన వెల్లడించారు.