Couple killed in elephant attack : ఒంటరి ఏనుగు బీభత్సం.. దంపతులు మృతి, మరో యువకుడి పరిస్థితి విషమం - Elephant
🎬 Watch Now: Feature Video
Published : Aug 30, 2023, 12:23 PM IST
Couple killed in elephant attack : చిత్తూరు జిల్లాలో ఏనుగుల సంచారం పల్లె ప్రజలకు కునుకు లేకుండా చేస్తోంది. ఏనుగుల గుంపు తరచూ పంటలపై దాడి చేయడంతో పాటు అడ్డుకునేందుకు యత్నించిన వారిపై విరుచుకుపడుతున్నాయి. దీంతో ఏ క్షణాన ఏం జరుగుతుందో ఆని స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా గుడిపాల మండలంలో ఒంటరి ఏనుగు బీభత్సం (Elephant panic) సృష్టించింది. రామాపురంలో పొలంలో పనిచేస్తున్న దంపతులపై దాడి చేయడంతో.. వారు అక్కడికక్కడే మృతి చెందారు
చిత్తూరు జిల్లా గుడిపాల మండలంలో బుధవారం ఒంటరి ఏనుగు బీభత్సం సృష్టించింది. ఏనుగుల గుంపు నుంచి విడిపోయి గ్రామ సమీపంలోని పొలాలపై పడింది. రామాపురంలో పొలంలో పనిచేస్తున్న వెంకటేశ్, సెల్వి దంపతులపై ఏనుగు దాడి చేయడంతో.. వారు అక్కడికక్కడే మృతి చెందారు. ఆ తర్వాత సీకే పల్లె లో మామిడి తోట (Mango orchard) లో కార్తీక్ అనే యువకుడి పై ఒంటరి ఏనుగు దాడి చేయగా.. తీవ్రంగా గాయపడిన అతడిని చికిత్స నిమిత్తం సీఎంసీ ఆస్పత్రికి తరలించారు. కార్తీక్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఒంటరి ఏనుగును అటవీ ప్రాంతంలోకి తరిమేయడానికి అటవీ శాఖ (Forest Department) అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల చిత్తూరు జిల్లాలో ఏనుగుల దాడులు ఎక్కువయ్యాయి. వీటిని అరికట్టడానికి అధికారులు చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయని స్థానికులు చెప్తున్నారు.