ఆలేరులో డబుల్ బెడ్ రూం ఎంపిక కార్యక్రమంలో రసాభాస
🎬 Watch Now: Feature Video
Corruption in Double bedroom scheme in Yadadri: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకం లబ్ధిదారుల ఎంపికలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయంటూ దరఖాస్తుదారులు ఆందోళన చేపట్టారు. అర్హులైన వారికి కాకుండా అనర్హులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించారంటూ కొందరు ఒక్కసారిగా స్టేజ్‌పైకి దూసుకెళ్లారు. లబ్ధిదారుల ఎంపిక కోసం ఏర్పాటు చేసిన సమావేశ ప్రాంగణమంతా రసాభాసగా మారింది.
దీంతో అక్కడ గందరగోళానికి దారి తీసింది. ఇళ్ల కేటాయింపులో అక్రమాలకు పాల్పడుతున్నారని, అనర్హుల డబ్బులకు, రాజకీయ ఒత్తిళ్లకు భయపడి తహసిల్దార్ లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారని దరఖాస్తుదారులు ఆరోపిస్తున్నారు. అధికారులు అర్హులైన పేదవారికి మాత్రమే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించాలంటూ పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ఇళ్ల కేటాయింపుపై విచారణ జరిపి అనర్హుల కేటాయించినవి రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వారిని శాంతింపజేశారు.