ఆరు గ్యారెంటీల అమలు దిశగా అడుగులు వేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
🎬 Watch Now: Feature Video
Published : Jan 9, 2024, 9:45 PM IST
Prathidwani on Congress Six Gurantees Schemes : ఇచ్చిన హామీ మేరకు ఆరు హామీలే మా తొలి ప్రాధాన్యమంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం. అన్న మాట ప్రకారం వంద రోజుల్లోనే వాటి అమలు ప్రారంభిస్తామని భరోసాగా చెబుతున్నారు ప్రభుత్వ పెద్దలు. అందుకోసం ఉద్దేశించిన ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజల నుంచి కూడా భారీ ఎత్తునే స్పందన వచ్చింది. ప్రజా పాలనలో వచ్చిన దరఖాస్తుల్లో కోటి పైగా హామీలకు సంబంధించినవే. వాటి పరిష్కారం దిశగా మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
Government on Schemes : ఈ దరఖాస్తుల పరిష్కారంలో ఇకపై అధిగమించాల్సిన సవాళ్లేంటి? సంక్షేమపథకాల లబ్దిదారుల ఎంపికలో గతంలో జరిగిన లోటుపాట్లకు తావులేకుండా ఏం చేస్తే మేలు? హామీల అమలుకు కావాల్సిన వనరులు సమీకరించడం కోసం ప్రభుత్వం ముందున్న మార్గాలేంటి? వ్యవసాయ కార్మిక సంఘం తరఫున ఆరు హామీల అమలు విషయంలో ఏ ఏ అంశాలు పరిగణ నలోకి తీసుకోవాలి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.