Congress BRS Leaders Clash in Jadcherla : మహబూబ్​నగర్​లో టెన్షన్​.. టెన్షన్​.. బీఆర్​ఎస్ ​- కాంగ్రెస్​ నేతల మధ్య ఘర్షణ - Congress BRS clash in Nasrullabad

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 20, 2023, 9:19 PM IST

Congress BRS clash in Nasrullabad Mahbubnagar : మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం నస్రుల్లాబాద్‌లో కాంగ్రెస్ - బీఆర్​ఎస్​ నేతల మధ్య జరిగిన ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. జడ్చర్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకుడు అనిరుధ్‌రెడ్డి సేవ్ జడ్చర్ల పేరుతో పాదయాత్ర చేపడుతున్నారు. ఇవాళ ఆ పాదయాత్ర నస్రుల్లాబాద్‌కు చేరుకుంది. యాత్రలో భాగంగా ఏర్పాటు చేసిన కూడలి సమావేశంలో నస్రుల్లాబాద్‌లో స్మశాన వాటిక స్థలానికి సంబంధించి అనిరుద్ రెడ్డి పలు ఆరోపణలు చేశారు. కూడలి సమావేశం అనంతరం పాదయాత్ర కొనసాగించారు. కాగా ఆయన చేసిన ఆరోపణలపై బీఆర్​ఎస్​ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ - బీఆర్​ఎస్​ కార్యకర్తల మధ్య మాటమాట పెరిగి ఘర్షణకు దారి తీసింది. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ సమయంలో తోపులాట జరిగింది. ఘర్షణలో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. అనంతరం గ్రామంలో పోలీసులు పికెట్​ ఏర్పాటు చేశారు. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.