చిరుతకు పాలు తాగించిన యోగి.. ఏం పేరు పెట్టారో తెలుసా? - yogi feeds leopard cub

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 5, 2022, 10:52 PM IST

Updated : Feb 3, 2023, 8:29 PM IST

వణ్యప్రాణి సంరక్షణ వారోత్సవాల్లో భాగంగా ఉత్తర్​ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. గోరఖ్​పుర్​లోని అష్ఫక్ ఉల్లాఖాన్ జువలాజికల్ పార్క్​ను సందర్శించారు. ఈ సందర్భంగా తెల్ల పులి గీతను జంతు ప్రదర్శన శాలలో విడిచిపెట్టారు. రెండున్నర నెలల క్రితం ఈ పులిని ఇక్కడికి తీసుకొచ్చారు అధికారులు. అంతకుముందు ఓ చిరుతకు పాలుపట్టించారు యోగి. గోరఖ్​పుర్​లోని వెటర్నరీ ఆస్పత్రి వైద్యుడు యోగేశ్ సింగ్ పర్యవేక్షణలో ఉన్న చిరుత పిల్లను ఒడిలోకి తీసుకొని.. డబ్బాతో పాలు తాగించారు. ఆ చిన్నారి చిరుతకు చండీ అని పేరు పెట్టారు. అనంతరం, అధికారులతో మాట్లాడారు.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.