CM Jagan Kodikatti Case: సీఎం జగన్ కోడికత్తి కేసులో బిగ్ ట్విస్ట్.. విచారణ విశాఖ ఎన్ఐఏ కోర్టుకు బదిలీ - కోడికత్తికేసు నిందితుడి తరఫు న్యాయవాదితో ముఖాముఖి
🎬 Watch Now: Feature Video
CM Jagan Kodikatti Case: సీఎం జగన్ కోడికత్తి కేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. దీనిపై విచారణ చేపట్టిన విజయవాడ ఎన్ఐఏ కోర్టు.. ఈ కేసును విశాఖ ఎన్ఐఏ కోర్టుకు బదిలీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈ కేసు విచారణ విశాఖ ఎన్ఐఏ కోర్టు చేపడుతుందని న్యాయమూర్తి వెల్లడించారు. తదుపరి విచారణను ఈ నెల 8వ తేదీకి వాయిదా వేసింది. అయితే ఈ కేసులో 80 శాతం వరకు విచారణ ఇప్పటికే పూర్తయిందని, ఈ కేసులో ప్రత్యక్ష సాక్షి సీఎం జగన్ కోర్టుకు హాజరై సాక్ష్యం చెబితేనే కేసు ముందుకు సాగుతుందని నిందితుడి తరఫు న్యాయవాది పేర్కొన్నారు. లేనిపక్షంలో ఈ కేసు విచారణ మరింత జాప్యం జరిగే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు. విజయవాడ ఎన్ఐఏ కోర్టు తీసుకున్న నిర్ణయంతో ఈ కేసు మరలా మొదటికి వచ్చే పరిస్థితి ఏర్పడిందని నిందితుడు శ్రీనివాసరావు తరఫు న్యాయవాది వాపోయారు. విజయవాడ కోర్టు తీసుకున్న నిర్ణయంతో కేసు ఇంకెన్ని రోజులు సాగుతుందోనని అంటున్న నిందితుడు శ్రీనివాసరావు తరఫు న్యాయవాది గగన సింధుతో మా ప్రతినిధి ముఖాముఖి..